Friday, October 23, 2009

అమెరికా అనుభవాలు: సొంత డబ్బా

23 అక్టోబరు 2009

వేమూరి వేంకటేశ్వరరావు

మూడేళ్ళ క్రితం సిలికాన్ ఆంధ్రా వారి సుజనరంజనిలో కిరణ్‌ప్రభ "నా అమెరికా అనుభవాలు", నెలనెలా ఒక వ్యాసం చొప్పున 23 నెలలు ధారావాహికగా ప్రచురించేరు. ఆ సందర్భంలో చాలా మంది ఆ "అనుభవాలు" పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ఆదివారం, అనగా 18 అక్టోబరు 2009 నాడు, హైదరాబాదులో, ఎమెస్కో వారి ప్రాంగణంలో ఈ అనుభవాలు పుస్తకరూపంలో ఆవిష్కరించబడింది. సుప్రసిద్ధ రచయిత, శ్రీ రావూరి భరద్వాజ ఆవిష్కరణ చేసేరు. సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ గారు మొదటి ప్రతిని అందుకున్నారు. ఈ సమావేశానికి శ్రీ విశ్వనాధ అచ్యుతదేవరాయలు గారు, శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు రావటం ఒక అపూర్వమైన సంఘటన.

ఈ పుస్తకం 1961 నుండి 1968 వరకు అమెరికాలో జరిగిన నా అనుభవాలే కాకుండా, ఒక విధంగా ఇది అమెరికాలో స్థిరపడ్డ మొదటితరం తెలుగువారి కథ.

ఈ పుస్తకం తెలుగుదేశంలో పుస్తక విక్రయశాలలో దొరుకుతోంది. జనవరి నాటికి అమెరికాలో కూడా లభ్యమయేటట్లు చూస్తాను. భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరైనా ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.