Thursday, December 17, 2009

తెలంగాణ: ఒక సామాన్యుడి అవగాహన

నేను ఇప్పుడు వరంగల్లులో ఉన్నాను. తెలంగాణ ఉద్యమం మంచి ఊపులో ఉన్న రోజులలో నేను ఇక్కడే ఉండి ఈ ప్రజల నాడి చూడటం తటస్థపడింది. "ఆంధ్రా వోళ్ళ" మీద ఈరికి ఉండిన అభిప్రాయం రోజూ వింటుంటిని. నేను తిరిగే సమాజం విద్యాధికులైన మధ్యతరగతి వ్యక్తులే. వీరిలో చాలమంది "ఆంధ్రా వోళ్ళు" వీరికి ఏదో పెద్ద అన్యాయం చేసినట్లు నమ్మే వారే. ఇప్పుడు, ఇక్కడ, ఈ ఆవేశపూరిత వాతావరణంలో, నిజానిజాలతో సంబంధం లేదు.

ఈ మధ్య ఈ ఊళ్ళో ఒక రచయితల (కవితలు రాసేవారు) సమావేశానికి వెళ్ళేను. దరిదాపు 30 మంది వచ్చేరు. వీరిలో నలుగురు అతి ఆవేశంగా, "ఆంధ్రా ఓళ్ళని" తిడుతూ, అసహ్యించుకుంటూ, పద్యాలు చదివేరు. బ్రిటిష్ వాళ్ళని కూడ భారతీయులు అంతగా అసహ్యించుకున్నారని నేను అనుకోను!

తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలని అంతగా అసహ్యించుకుంటూ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రా అంటూ ఎందుకు ఆంధ్రా వారు గొడవపెడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. కేంద్ర ప్రభుత్వం వాలకం చూస్తూ ఉంటే తెలంగాణాని విడదీయటంలో కేంద్రానికి ఏదో లాభం ఉండి ఉండాలి. ఏ రాష్ట్రమూ కేంద్రం కంటె బలంగా ఉండటం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు.

ఈ పరిస్థితులలలో తెలంగణాతోపాటు హైదరాబాదు కూడ ఆంధ్రాకి దూరం అయిపోవటం తధ్యం. ఇటుపైని హైదరాబాదులో పెట్టుబడులు తగ్గించి ఆంధ్రావారు ఏ విజయవాడనో, విశాఖనో వ్యాపార కేంద్రంగా నిర్మించుకోవటం శ్రేయోదాయకం. మళ్ళా ఏ కడపో, కర్నూలో ముఖ్యపట్టణం అయితే కొన్నాళ్ళ తరువాత రాయలసీమ వారు విడిపోతామంటారు. అప్పుడు కోస్తా అంధ్రాకి మిగిలేది సున్న.

1 comment:

  1. రావు గారు,

    'తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్లని ఆంధ్రోళ్లు పిచ్చోళ్లని చేసి ఆడిస్తున్నారు' అనేది కొందరు తెలంగాణ అతివాదుల నింద. ఇందులో కొంత నిజం లేకపోలేదు - తెలంగాణ ప్రజల అమాయకత్వం వరకూ. అమాయకుల్ని పిచ్చోళ్లని చేసి ఆడించటానికి అందరూ ముందే ఉంటారు మరి - తెలంగాణ 'మేధావుల'తో సహా. అమాయక పిచ్చోళ్లని రెచ్చగొట్టటం అతి సులువు కదా. మీరు చెప్పిన కవులు చేసేపని సరిగా ఇదే. తన్నండి, నరకండి, తరమండి అని పాటలు రాయటం తప్ప పనికొచ్చే పనులు ఏం చేశారు గనక ఇలాంటోళ్లు.

    సమైక్యాంధ్రా కోరుకునేవాళ్లు ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో సైతం ఉన్నారు. 'సమైక్యత' అంటే బూతైపోయిన ఈ దశలో, 'సమైక్యవాదుల తలలు నరుకుతాం, మెడలు తెగ్గోస్తాం' అంటూ వేర్పాటువాదులు విచ్చలవిడిగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న తరుణంలో తెగించి మనసులో మాట బయటపెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు తెలంగాణ సమైక్యవాదులు. అంతే.

    ReplyDelete