Tuesday, January 19, 2010

నాకు తెలియక అడుగుతాను

నాకు తెలియక అడుగుతాను, మరేమీ అనుకోకండి.
ఒక పక్క
దేశంలో దరిద్రం తాండవిస్తోంది.
లంచగొండితనం పరాకాష్ఠనందుకుంటోంది.
అవస్థాపన సౌకర్యాల స్థితి అధ్వాన్నంగా ఉంది.

మరోపక్క
చైనావాడు
మనా భూభాగాన్ని అంగుళం అంగుళం చొప్పున కబళించెస్తున్నాడు
అరుణాచల ప్రదేష్ అంతా తనదే అంటున్నాడు
దేశంలోకి చొరబడ్డమే కాకుండా మన కలన వలయాలలోకి కూడ చొరబడి
మన దేశపు అస్తిత్వానికే ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు

మరోపక్కనుండి
పాకిస్తాను వాడు
ముంబాయి మీద దండెత్తి
ఘజినీ, గోరీ రోజులు గుర్తుకు తెస్తున్నాడు

ఇన్ని సాధించవలసిన సమశ్యలు ఉండగా
మన తెలుగు విద్యార్ధులు
భావి భారత పౌరులు
నవయుగపు రథసారధులు
ఏమిటి చేస్తున్నారు?

రాజకీయనాయకుల చేతులలో చదరంగపు పావులుగా మారి
సొంతంగా ఆలోచించటం మాని
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

విశ్వవిద్యాలయాల్లో నేర్వవలసినది విచక్షణా జ్ఞానం
బుర్రలేని గొర్రెపోతులా కసాయివాడి వెనక నడవడం కాదు

5 comments:

  1. You forgot mentioning Nepal. You might be knowing Pracanda's inclination towards chaina.

    http://www.eenadu.net/breakhtml.asp?qry=break35

    ReplyDelete
  2. నిజమండి చాల బాధేస్తుంది ఈ దారుణాలు చూస్తుంటే ! మితి మీరిన స్వేచ్చ వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవి .

    ReplyDelete
  3. "నాకు తెలియక అడుగుతాను, మరేమీ అనుకోకండి."

    తెలిసినా ఏం చెయ్యలేకపోతున్నాం అదే బాధ

    ReplyDelete