Friday, October 8, 2010

ఏం? ఎందుకని? - 1

1. వర్షం పడ్డప్పుడు వానపాములు చపటాలమీదకి ఎందుకు ఎగబాకుతాయి?

మీరు ఎప్పుడైనా గమనించేరో లేదో, వర్షం పడ్డ తర్వాత నేల లోని వానపాములు బయటకొచ్చి, పొడిగా ఉన్న గచ్చు మీదకి, చపటాల మీదకి, రోడ్ల మీదకి ఎగబాకుతాయి. నిజానికి అప్పుడే మనకి వానపాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? వానపాములు మనలాగే గాలి పీల్చి బతుకుతాయి. వాన పడ్డప్పుడు వాటి శ్వాస రంధ్రాలు నీళ్ళతో నిండిపోతాయి కనుక వాటికి ఊపిరి సలపదు. అందుకని అవి పొడిగా ఉన్న స్థలాలలకి ఎగబాకుతాయి. అని సిద్ధాంతం. నిజం వానపాములకే తెలియాలి.

1 comment:

  1. వానపాముకి అంటే "అః నా పెళ్ళంట" లో కోట శ్రీనివాసరావుకా? (అరగుండు అతనిని "వానపాము వెధవ" అని తిడతాడు కదా :) ).

    ReplyDelete