Tuesday, July 12, 2011

తెలుగెందుకా?

తెలుగెందుకా?

అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు కొందరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి సహాయ సహకారాలతో, ఒక “మంచి” పని తలపెట్టేరు. అదేమిటంటే బర్క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం స్థాపించటానికి పునాదులు వేసేరు. ఇది ఇంతింతై, ఎంతో పెద్దదై ప్రపంచంలోనే అత్యుత్తమమైన తెలుగు పీఠంగా వర్ధిల్లాలని వారి ఆకాంక్ష.

ఇలాంటి “మంచి” పని ఏది చెయ్యాలన్నా డబ్బు కావాలి కదా. కనీసం 1.5 మిలియను డాలర్లు కావలసి ఉంటుందని విశ్వవిద్యాలయం వారు అంచనా వేసేరు. ఈ డబ్బు దండటానికి బుజం మీద ఉన్న గావంచాని జోలెలా చాచి, బిచ్చం వెయ్యమని అందరినీ అడగటం మొదలుపెట్టేం. ఇచ్చేవాడికి అడిగేవాడు లోకువ. “మనకి తెలుగెందుకండీ? వెళ్లండి! వెళ్లండి!” అని తరిమి కొట్టినవాళ్లే ఎక్కువ. దాలిగుంటలో కుక్కని “ఛీ, ఛీ” అంటే దులుపుకుని పోయినట్లే ఈ దూషణ, తిరస్కారాలు ఈ శరీరమునకే కాని ఆత్మకి చెందవు” అని సంజాయిషీ చెప్పుకుని, మొత్తం మీద 350,000 డాలర్లు పోగుచేసి, విశ్వవిద్యాలయానికి ఇచ్చి పీఠం మొదలు పెట్టేం.

“ఇంగ్లీషు చదువు ఉద్యోగాలు ఇస్తున్నాయి” అనే భ్రమతో తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా అందరికీ ఒక రకమైన తృణీకారభావం అలవాటవుతోంది. తెలుగు నేర్చుకోకూడదు, తెలుగు మాట్లాడకూడదు, పరికిణీ, ఓణీ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అంటూ ఇలా మనం చెయ్యకూడని పనుల జాబితా చాల పెద్దదే ఉందనిపిస్తోంది.

మన వేషభాషల మీద, మన జాతి మీద, మన మతం మీద ఇంత తృణీకారభావం, ఇంత విస్తృతంగా పెరిగిందంటే దీనికి ఏదో గట్టి కారణమే ఉండి ఉండాలని నాకు అనుమానం వచ్చింది. కాని దీనికి కీలకమైన మూల కారణం ఏమిటో తెలియలేదు – నిన్నటి వరకు. ఇప్పుడు తెలిసింది. మీరందరూ ఇంగ్లీషు మీద మమకారంతో ఇంగ్లీషు మీద ప్రావీణ్యం సంపాదించి ఉన్న వారే కనుక, మన సంస్కృతి మీద మనకి విరక్తి కలగటానికి జరిగిన కుట్ర గురించి ఆ కుట్రదారుల మాటలలోనే చెబుతాను. చదవండి.

Lord Macaulay’s address to the British parliament, 2 February 1835

“I have travelled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief, such wealth I have seen in this country, such high moral values, people of such caliber, that I do not think we will ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore I propose we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture, and they will become what we want them, a truly dominated nation.”

ఇది చదివిన తరువాత మనది భ్రస్టు పట్టిపోయిన సంస్కృతి అని మీరు ఇంకా నమ్ముతున్నారా? మెకాలే చేసిన మోసానికి ప్రతి మోసం ఏమిటంటే ఇంగ్లీషు నేర్చుకుని ప్రపంచాన్ని జయించండి. కాని మన భాషని, మన జాతిని, మన సంస్కృతిని మరచిపోకండి.

మీ మనస్సు స్పందిస్తే, http://FriendsOfTelugu.org కి వెళ్లి తెలుగు పీఠం కోరకు జరుగుతూన్న ప్రయత్నాలు చూడండి. చంద్రుడికో నూలుపోగులా మీకూ సహాయం చెయ్యాలని ఉంటే అక్కడ ఉన్న PayPal ద్వారా మీరు కూడా బిక్ష వెయ్యండి. మేము జోలె పట్టుకుని ఇక్కడ నిలబడ్డాం. శలవు.

7 comments:

  1. తానాలకి, తందానాలకి సిన్మా యాక్టర్లని పిల్చి (శ్రేయ, తాప్సీలకి తెలుగుకి సంబంధం ఏంటో) డబ్బులు వ్రుధా చేసే బదులు, ఇక్కడిచ్చి చావొచ్చుగా ఆళ్ళు!

    ReplyDelete
  2. మీరిచ్చిన వెబ్సైటు లింక్ పనిచేయటం లేదండి , దయచేసి ఒకసారి చెక్ చేయగలరు ! తెలుగు పీఠం కోసం మీందరూ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి అని కోరుకుంటున్నాను .
    మీ పోస్ట్లు లో మెకాలే చెప్పాడు అని mention చేసినది hoax అని విన్నాను కదా ?
    @చెంబు గారు ఇక్కడ ఉన్నవాళ్లకే సరైన ఉపాది లేక , ఇంకా ఇప్పటికే జనాభా ఎక్కువై కొట్టుకున్తున్నాం కదా ఇక వాళ్ళు కూడా వచ్చి ఏమి చేయాలంటారు ?

    ReplyDelete
  3. http://FriendsOfTelugu.org

    is the correct web site

    ReplyDelete
  4. ఇప్పుడు పనిచేస్తుందండి !Thank you !

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. Sorry, It looks like I fell for the hoax. Nevertheless, my message to preserve our language and culture still stands.

    ReplyDelete