23 అక్టోబరు 2009
వేమూరి వేంకటేశ్వరరావు
మూడేళ్ళ క్రితం సిలికాన్ ఆంధ్రా వారి సుజనరంజనిలో కిరణ్‌ప్రభ "నా అమెరికా అనుభవాలు", నెలనెలా ఒక వ్యాసం చొప్పున 23 నెలలు ధారావాహికగా ప్రచురించేరు. ఆ సందర్భంలో చాలా మంది ఆ "అనుభవాలు" పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ఆదివారం, అనగా 18 అక్టోబరు 2009 నాడు, హైదరాబాదులో, ఎమెస్కో వారి ప్రాంగణంలో ఈ అనుభవాలు పుస్తకరూపంలో ఆవిష్కరించబడింది. సుప్రసిద్ధ రచయిత, శ్రీ రావూరి భరద్వాజ ఆవిష్కరణ చేసేరు. సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ గారు మొదటి ప్రతిని అందుకున్నారు. ఈ సమావేశానికి శ్రీ విశ్వనాధ అచ్యుతదేవరాయలు గారు, శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు రావటం ఒక అపూర్వమైన సంఘటన.
ఈ పుస్తకం 1961 నుండి 1968 వరకు అమెరికాలో జరిగిన నా అనుభవాలే కాకుండా, ఒక విధంగా ఇది అమెరికాలో స్థిరపడ్డ మొదటితరం తెలుగువారి కథ.
ఈ పుస్తకం తెలుగుదేశంలో పుస్తక విక్రయశాలలో దొరుకుతోంది. జనవరి నాటికి అమెరికాలో కూడా లభ్యమయేటట్లు చూస్తాను. భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరైనా ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.
Friday, October 23, 2009
Subscribe to:
Post Comments (Atom)
Congrats.
ReplyDeleteపేపర్ లో చదివానండి ! మీకు అభినందనలు .
ReplyDeleteవిశాలాంధ్రలో దొరికితే తప్పక చదువుతానండి. మీ రసాయన శాస్త్ర పాఠాలు కూడా పుస్తకంగా చూడాలని ఉంది.
ReplyDeleteనా "ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం" లోని వ్యాసాలకి ఆధారం నా "రసగంధాయరసాయనం" అనే పుస్తకం. ప్రతులు కావలసిన వారు, రూ. 100/= ఈ దిగువ చిరునామాకి పంపితే టపాలో పుస్తకం పంపే ఏర్పాటు చెయ్యగలం. టపా ఖర్చులు పోను మిగిలినది విద్యార్ధి వేతనాలకి ఉపయోగిస్తాం.
ReplyDeleteSri Vadrevu Seshagirirao Memorial Charitable Trust
13-405 Alakapuri, Hyderabad- 500 035
మీ పూర్తి చిరునామా, వీలయితే టెలిఫోను నంబరు కాని E-mail కాని తప్పకుండా పంపండి.
చాలా సంతోషం మాస్టారూ. అభినందనలు
ReplyDelete