13. మనకి దురద ఎందుకు వేస్తుంది?
దోమ కుట్టితే దురద వేస్తుంది; నొప్పి పెట్టదు. దురదగుండాకు ఒంటికి తగిలితే దురద వేస్తుంది. కురుపు పక్కు కట్టి మానుతూన్నప్పుడు దురద వేస్తుంది. ఎందుకు?
తేనెటీగ కుట్టినప్పుడు శరీరం లోనికి వెళ్లిన విషం వల్ల నొప్పి పుడుతుంది. తేలు విషం శరీరం లోనికి వెళ్లినప్పుడు పుట్టే సలుపు వరసే వేరు. కాని దోమ కుట్టినప్పుడు తేనెటీగ విషం లాగా, తేలు విషం లాగా బాధ పెట్టదు; దురద వేస్తుంది. దోమకాటుకి దురద ఎందుకు వేస్తుందో ముందస్తుగా చెప్పనివ్వండి. నిజం చెప్పినందుకు నిష్టూరాలడవద్దని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.
దోమ కుట్టినప్పుడు అది నిజంగా మన రక్తం తాగుతున్నాదన్నమాట; తేనెటీగ లాగ తేలు లాగ మన శరీరం లోకి విషం ఎక్కించటం లేదు. తన పొట్ట నిండా మన రక్తం తాగేసిన తరువాత దోమ బరువెక్కి పోతుంది. పొట్టడు రక్తంతో దోమ మరి ఎగరలేదు. పోనీ ఆ తాగిన రక్తం బాగా ఒంట పట్టే వరకు మన శరీరం మీదే కాలక్షేపం చేద్దామా అంటే మనం మాత్రం తక్కువ వాళ్లమా? దాని చెంప చెళ్లు మనిపించెయ్యమూ? అందుకని తొందరగా పొట్ట నింపేసుకొని దోమ పలాయన మంత్రం పఠించాలాయె. ఎగరగలగటానికి ఎలాగో ఒక లాగ మన దోమ తన బరువుని తగ్గించుకోవాలె. మార్గాంతరం లేక దోమ మన మీద అల్పాచిమానం చేసేసి వెళ్లిపోతుంది. పోతూ పోతూ పొయ్యిలో ఉచ్చోసి పోవటం అంటే అక్షరాలా ఇదే! ఈ అల్పాచిమానం వల్లనే మనకి దురద వేస్తుంది. దోమ కాటులో విషం లేదని తెలిసి సంతోషించడమా? దోమ కరచిన కాటుకి కాకపోయినా అది పోతూ పోతూ చేసిన పనికి ఒళ్లు మండి ఏడవటమా? మగడు కొట్టేడని కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చినట్లు ఉంది ఈ ఉదంతం.
దురద అంటే నొప్పి కాదు. నొప్పి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దురద చర్మం మీదే వేస్తుంది. చర్మం ఎండిపోయినా, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నా దురద వేస్తుంది. ఈ రకం దురద బాధ నుండి తప్పించుకోవాలంటే శరీరాన్ని “చెమ్మ”గా ఉంచుకుంటే సరిపోతుంది. అందుకనే చలికాలంలో ఒంటికి వెన్నపూస రాసుకోవటం. మూత్ర పిండాలకి వ్యాధి వచ్చినా దురద వెయ్యవచ్చు.
దురద వేసినప్పుడు గోకాలనే బుద్ధి ఎందుకు పుడుతుందో తెలుసా? గోకినప్పుడు ఆ గోకుడు వల్ల నొప్పి పుడుతుంది. 'దురద వేస్తున్నాదీ, 'నొప్పి పుడుతున్నాదీ అనే వాకేతాలు (signals) రెండూ మెదడుకి ఒకే సారి చేరుకుంటాయి. అప్పుడు మెదడు 'నొప్పి పెడుతున్నాదీ' అనే వాకేతానికి ప్రాముఖ్యత ఇచ్చి, దురద వాకేతాన్ని విస్మరిస్తుంది.
నొప్పి మీద పరిశోధన చాల కష్టం. ఏందుకంటే మందు ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే దానిని మనుష్యుల మీద ప్రయోగించాలి. కాని మనుష్యుల మీద ప్రయోగాలంటే మనం అంతగా ఇష్టపడం.
Thursday, February 3, 2011
Subscribe to:
Post Comments (Atom)
thats not uchha but its ummi[laalaajalam]valla durada vaesttundi[like jalaga lu]
ReplyDeletewow...మీ బ్లాగు చాలా బావుంది. నేను ఆలశ్యంగా చూసాను. మంచి మంచి విషయాలన్నీ తేలికైన భాషలో రాస్తూ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. చాలా thanks...ఆలశ్యంగానైన మీ బ్లాగు చదవగలిగినందుకు సంతోషంగా ఉంది....బాగా రాస్తున్నారు keep it up
ReplyDeleteastrojoyd గారు
ReplyDeleteమీరు చెప్పినదే సరి అయిన సమాధానం. కుట్టిన చోట రక్తం గడ్డకట్టిపోకుండా, సజావుగా ప్రవహించటానికి, దోమ లాలాజలం (ఉమ్మి) ఉపయోగపడుతుంది. దోమ లాలాజలం లాతి పదార్ధం (అంటే, మన శరీరానికి సంబంధించినది కానిది) అనే వార్త మన శరీరంలోని రోగనిరోధక తంత్రం (immune system) తెలుసుకుని ఆ శత్రువుని (antigen ని) ఎదుర్కొనటానికి histamine అనే రసాయనాన్ని పంపుతుంది. ఈ histamine వల్లనే కుట్టిన చోట ఎర్రటి దద్దురు (wheal) లేస్తుంది. ఈ వాపుతోపాటు అక్కడ ఉన్న కేశనాళికలు (capillaries) కూడా వాచుతాయి. ఇలా వాచిన కేశనాళికలు పక్కనే ఉన్న నాడీతంతులని చిరాకు పెడతాయి. అదే దురద లా మనకి అనిపిస్తుంది. (పడిశం పట్టినప్పుడు ముక్కులోని పొరలు వాచటానికి కూడ ఈ హిస్టమీనే కారణం!)