మష్‌రూం ఫ్రై.
నేను రాస్తూన్న తెలుగు అందరికీ అర్ధం అవటంలేదని ఈ మధ్య కొందరు ఆవేదన వ్యక్త పరచేరు. వ్యక్త పరచటమేమిటి, నా మొహం. "అయ్యా! మీరు ఇలా రాస్తే మేం వేసుకోలేం. మీరు వాడే మాటలు మాకు అర్ధం కావటం లేదు," అని నిర్మొహమాటంగా చెప్పేసేరు.
నేను నలభై ఏళ్ళబట్టి తెలుగులో రాస్తున్నాను. నేను రాసినది బాగులేదని తిరస్కరించబడటం బహు కొద్ది సార్లు జరిగింది. "మీ శైలి బాగుంటుంది గురువుగారూ, ఇంకా రాయండి!" అన్నవాళ్ళూ ఉన్నారు. "ఈ దూషణ, భూషణ తిరస్కారాలు ఈ శరీరమునకే కాని ఆత్మకి చెందనేరవు" అనుకుంటూ నా ధోరణి ఎప్పుడూ మార్చలేదు.
కాని నేను భౌతికశాస్త్రంలో వచ్చే వర్క్ అన్న మాటకి పని అనిన్నీ, ఎనర్జీ అన్న మాటకి శక్తి అనిన్నీ రాస్తే ఆ మాటలు తెలుగు వారికి అర్ధం అవవు అని తెలుగు వికీపీడియా నిర్వాహకులు అనేసరికి నాకు కనువిప్పు కలిగింది. ఎక్కడో అమెరికాలో కూర్చుని నలభై ఏళ్ళ క్రితపు తెలుగుని, బూజు పట్టిపోయిన తెలుగుని, నేను ఇప్పుడు రాయబూనుకుంటే ఏమి సమంజసంగా ఉంటుంది? మారే కాలంతో భాష మారుతోంది, సినిమా పాటలు మారుతున్నాయి. నేనే మారలేదు. కూపస్థ మండూకంలా ఈ అమెరికాలో కూర్చున్నాను. తెలుగు దేశం పరుగెత్తుకు ముందుకు పోతోంది.
అందుకని తెలుగులో బాగా రాసే రచయితలు ఎవ్వరో కొందరిని అనుకరించి నా భాషని కొంచెం అభివృద్ధి చేసుకుందామని పాత రచనలు తిరగేసేను. మా ఊరు వాడు, ఢోకా లేకుండా పేరున్నవాడు అయిన అవసరాల రామకృష్ణారావు కనిపించేడు. కనిపించేడంటే ఎదురుగుండా దేవుడిలా ప్రత్యక్షమయేడని కాదు; మనస్సులో మెదిలేడు.
"తెలుగు నుడికారం ఉట్టిపడుతూన్న ఇంత మంచి తెలుగు మీరు ఎలా రాయగలుగుతున్నారండీ?" అని రామకృష్ణారావు గారిని ఎవ్వరో అడిగితే, "మా వంటింటి గుమ్మంలో కూర్చుని ఆడవాళ్ళు మాట్లాడుకునే భాషని కాపీ కొడతానండీ!" అన్నారుట.
ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ నా టెలుగూ రైటింగుని ఇంప్రూవు చేసుకుందికి నేను కూడా - మా కిచెన్ కి గుమ్మాలు లేవు కనుక - డైనింగ్ టెబుల్ దగ్గర కూర్చుని మా ఆవిడని ఆశ్రయించేను – కోంచెం వంటింటి తెలుగు నేర్పమని.
"ఈ మంత్ తెలుగునాడి మేగజైనులో రిసపీ చూసి మష్‌రూం ఫ్రై చేస్తున్నాను. దగ్గరుండి వాచ్ చేస్తే మీకు వంటా వస్తుంది, మీ భాషా బాగుపడుతుంది" అని నాకు వంటింట్లో మొదటి పాఠం మొదలు పెట్టింది.
కావలసిన ఇన్‌గ్రీడియంట్సు
బాస్మతి రైస్ - 2 కప్స్
మష్రూంస్ - 1 పేకెట్ (లేదా ప్యాకెట్)
అనియన్స్ - 1 క్యాప్సికం - 1 (లేదా కేప్సికం)
బీన్స్ - 6
జింజిర్-గార్లిక్ పేస్ట్ - 1 స్పూన్
సోయా సాస్ - 1 స్పూన్
టొమేటో పేస్ట్ - 1 స్పూన్
క్యుమిన్ - 1 స్పూన్
పెప్పర్ పౌడర్ - 1 స్పూన్
ఆయిల్ - ½ కప్
గార్లిక్ ఫ్లేక్స్ - 4
జింజిర్ - స్మాల్ పీస్
వాటర్ - సూటబుల్ ఎమౌంట్
సాల్ట్ - సూటబుల్ ఎమౌంట్
ప్రిపరేషన్ పద్ధతి:
ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్‌ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ప్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.
"పేషెంటుగా విన్నందుకు థేంక్సండీ. నౌ డిషెస్ వాష్ చేసేసి అప్పుడు కావలిస్తే టి. వి. వాచ్ చెయ్యండి. టుమారో యు కెన్ ట్రై మష్‌రూం ఫ్రై!"
Saturday, July 26, 2008
Subscribe to:
Post Comments (Atom)
అద్భతమైన సెటైర్ .. బాగుంది.
ReplyDeleteమీ నుంచి వంటలు కాక వెరే ఇతర విషయాలపై రాసేవాటికోసం ఎదురు చూస్తాము. ఏమిటో, ఎందుకనో మీ నుంచి వంటలు ఊహించలేదు మరి. మీ తెలుగు బాగుంది. బ్లాగులోకానికి స్వాగతం పలుకుతున్నాము. ఈ word verification తీసివేయగలరు.
ReplyDeletemanchi fry lanti blog
ReplyDeleteసెటైర్ అదిరింది. బయటకి కనపడకుండా లోపల్లోపల సలపరం పుట్టేంచేలా వుంది.
ReplyDelete:)
ReplyDelete<<<<
ReplyDeleteకాని నేను భౌతికశాస్త్రంలో వచ్చే వర్క్ అన్న మాటకి పని అనిన్నీ, ఎనర్జీ అన్న మాటకి శక్తి అనిన్నీ రాస్తే ఆ మాటలు తెలుగు వారికి అర్ధం అవవు అని తెలుగు వికీపీడియా నిర్వాహకులు అనేసరికి నాకు కనువిప్పు కలిగింది.
>>>>
ఎవరన్నారో కానీ నేను తెలుగు మీడియంలో పని అనే, శక్తి అనే చదువుకున్నా.
శక్తినిత్యుత్వ నియమమో మరేదో కూడా చదివాను.
భలే వాళ్ళే, పని, శక్తి అంటే తెలీని వాళ్ళూ ఉంటారా?
ReplyDeleteనేనూ తెలుగు మీడియంలో electro-magnetic wavesని విద్యుతయస్కాంత తరంగాలనే చదువుకున్నా.
కర్భన రసాయన శాస్త్రం..కలన గణితం..వామ్మో అన్నీ మర్చిపోయా..