భారత దేశంలో అమలులో ఉన్నది ప్రజాస్వామ్యం - అంటే ప్రజలకోసం, ప్రజల వల్ల నడపబడే ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరివి సమాన హక్కులు. మనది ఉత్త ప్రజాస్వామ్యమే కాదు - మనది మతాతీత రాజ్యాంగం. అంటే ప్రభుత్వం అన్ని మతాలనీ సమ దృష్టితో చూడాలి. ఇంగ్లండు, అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన పాశ్చాత్య దేశాలలో ఉన్న ప్రభుత్వాలు చాల మట్టుకు - కొద్ది కొద్ది తేడాలతో - మతాతీత ప్రజాస్వామ్యాలే. ఈ మతాతీత ప్రజాస్వామ్యాలలో లౌకిక (సివిల్)విషయాలలోనూ, శిక్షా (క్రిమినల్) విషయాలలోనూ, ప్రభుత్వం ప్రజలందరినీ సమ దృష్టితో చూస్తుంది. ఉదాహరణకి పెళ్ళిళ్ళ విషయాలలోనైతే నేమి, ఆస్తి పంపకాల విషయంలో అయితేనేమి, దేవాలయాల నిర్మాణం లో అయితేనేమి చట్టబద్ధంగా ప్రవర్తించినంతసేపూ పౌరులందరివీ సమాన హక్కులే.
కాని భారత దేశంలో ప్రస్తుతం చలామణీ అవుతూన్న ప్రజాస్వామ్యపు పరిస్థితి వేరు. ఉదాహరణకి శిక్షాస్మృతి ప్రకారం ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానమే కాని లౌకిక స్మృతిలో మన ప్రభుత్వం ఒకొక్క వర్గాన్ని ఒకొక్క ప్రత్యేక దృష్టితో చూస్తుంది. కుల విచక్షణ కూడదంటూనే కులాలవారీగా ప్రత్యేక సదుపాయాలు చెయ్యటం, మతాతీతం అంటూనే ముస్లింల హాజ్ యాత్రకీ, ఇటీవల క్రైస్తవుల జెరూసలేం యాత్రలకి ప్రత్యేక నిధులు మంజూరు చెయ్యటం, మొదలైనవి ఈ కోవకి చెందితాయి. (ఇవి ఓట్ల కోసం చేసే గారడీలు మాత్రమే.)
లౌకిక (లేదా పౌర) స్మృతిలో వ్యక్తిగత హక్కులు అంతం అయే అవధి ఎక్కడ, సమాజం యొక్క సమష్టి హక్కులు మొదలయ్యేది ఎక్కడ అనే సమస్య కొంచెం జటిలమైనదే. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ఈ సమస్యని ఎలా ఎదుర్కుంటున్నాయో చూస్తే కొన్ని ఆధారాలు దొరుకుతాయి.
ఒక వ్యక్తి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, ఏ దుస్తులు ధరించాలి, ఎవ్వరిని వివాహమాడాలి మొదలైన వ్యక్తిగత విషయాలలో ప్రభుత్వం జోక్యం కలుగజేసుకోవలసిన అవసరం సర్వసాధారణంగా ఉండదు. కాని ఉదాహరణకి ఒక వ్యక్తి నమ్మకాలవల్ల కాని, వేషధారణ వల్ల కాని సంఘానికి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లయితే అటువంటి సామాజిక విషయాలలో ప్రభుత్వం కలుగజేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు.
ముస్లిం వనితలు ముఖం కనిపించకుండా బురఖా ధరించటం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. కాని ఈ రోజుల్లో తీవ్రవాదులు బురఖాలు వేసుకుని ప్రజల మధ్య బాంబులు పేల్చే అవకాశాలు పెరుగుతున్నాయి కనుక బహిరంగ ప్రదేశాలలో ముస్లిం స్త్రీలు బురఖాలు వేసుకోకూడదని పాశ్చాత్య దేశాలలో ఒక చర్చ జరిగింది. ఇదే విధంగా శిఖ్ఖులు (మగవారు) కీర్పన్ అనే కత్తిని ధరించి విమానాలు ఎక్కితే ప్రభుత్వం ఊరుకోవటం లేదు. ఇటువంటి సందర్భాలలో "ప్రభుత్వం మమ్మల్ని విచక్షణా పూరితమైన జుగుప్సతో చూస్తున్నాది" అని అలమటించి లాభం లేదు.
మరొక ఉదాహరణ, అమెరికాలో సెవెంత్ డే ఏడ్వెంటిస్ట్ అనే ఒక మతం ఉంది. ఇది క్రైస్తవ మతంలో ఒక శాఖ. వీరి నమ్మకం ప్రకారం ప్రాణాపాయ సమయంలో కూడా కృత్రిమమైన మందులు వాడకూడదు. ఈ నమ్మకంతో వారు పిల్లలకి టీకాలు వేయించటానికి కూడ సుముఖత చూపరు. అంటురోగాలని అరికట్టాలంటే జనాభా అంతటికీ టీకాలు వెయ్యాలి - బలవంతగానైనా వెయ్యాలి; లేకపోతే వ్యాధులు ప్రజలమీదకి మహామారిలా విరుచుకు పడతాయి. ఇటువంటి నమ్మకంతో చంటివాడికి ప్రాణం మీదకి వచ్చినా "వైద్యం చేయించం" అని ఒక జంట మంకు పట్టు పడితే ప్రభుత్వం ఆ తల్లిదండ్రులని న్యాయస్థానానికి ఈడ్చి, పిల్లాడిని జప్తు చేసి, బలవంతంగా వైద్యం చేయించింది. ప్రభుత్వానికి ఈ హక్కు ఎక్కడినుండి వచ్చింది? తల్లిదండ్రులకి తమ మతం మీద ఎంత నమ్మకం ఉన్నా ఆ నమ్మకంతో మరొక ప్రాణం తీసే హక్కు వారికి లేదు అని న్యాయస్థానం తీర్మానించింది. ఈ సందర్భంలో సమాజపు హక్కు వ్యక్తిగత హక్కుల మీద తురుఫు అయిందన్న మాట.
దీని నీతి ఏమిటన్న మాట? మత సంబంధమైన విషయాలైనప్పటికీ కొన్ని విషయాలలో జోక్యం కలుగజేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇదే తర్కం ఉపయోగించి బ్రిటిష్ వారు సతీ సహగమనం నిషేధించేరు. ఆస్థి హక్కులు, ఏకపత్నీవ్యవస్త, పునర్వివాహాల నిబంధనలు ఈ కోవకి చెందినవే.
భారతదేశంలో "సెక్యులరిజం" పేరిట జరుగుతున్నది దీనికి వ్యతిరేకం. ఒక దేశం నిజంగా సెక్యులర్ అయినప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ - అంటే, అన్ని కులాల వారికీ, అన్ని మతాల వారికీ, అన్ని రాష్ట్రాలవారికీ - ఒకే చట్టం ఉండాలి. ప్రభుత్వం దేవాలయాలనీ, మసీదులని, చర్చిలనీ, గురుద్వారాలనీ నడపటానికి తలదూర్చకూడదు - వాటిపై పర్యవేక్షణ ఉండొచ్చు. క్రైస్తవులకి ఒక చట్టం, ముసల్మానులకి ఒక చట్టం, బౌద్ధులకి ఒక చట్టం, హిందువులకి మరొక చట్టం ఏమిటి? మనని విభజించి పాలించటానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన అమరిక ఇది.
ఒక ఉమ్మడి పౌర స్మృతి అంటూ ఉంటే దాంట్లో అధికరణాలు ఏవేమిటి ఉండాలి? అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాలని పరిశీలించి మనం ఒక రాజ్యాంగాన్ని ఎలా నిర్మించుకున్నామో అదే విధంగా హిందూ, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ, సిఖ్ఖు, పార్సీ మతాలలోని అభ్యుదయ భావాలని సేకరించి, సర్వ సమ్మతమైన కనీస అంశాలతో ఒక ఉమ్మడి పౌర స్మృతిని నిర్మించుకోవచ్చు.
గుడ్డిలో మెల్లలా భారతదేశంలో రాజకీయాలకీ, సొంతలాభాలకీ అతీతంగా రెండు సంస్థలు ఉన్నాయి: మిలటరీ, సుప్రీం కోర్టు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన సుప్రీం కోర్టు ఎన్నో సార్లు సోత్సాహంగా కలుగజేసుకుని మన దేశానికి ఎనలేని మేలు చేసింది. సమాన హక్కుల విషయంలో కూడా మన ప్రధాన న్యాయస్థానం ఈ మధ్యనే (ఒక ఏడాది క్రితం) కొన్ని సూచనలు చేసింది. ప్రజాస్వామ్యంలో "యథా ప్రజా తథా రాజా" కనుక మనం కుల, మత, వర్గాలకి అతీతంగా నిజమైన ప్రజాసేవకులని మనం ప్రతినిధులని ఎన్నుకుంటే దేశం పురోగతి సాధిస్తుంది.
Monday, December 15, 2008
Subscribe to:
Post Comments (Atom)
రావు వేమూరి గారు,
ReplyDeleteమీ శైలి బాగుంటుంది గురువుగారూ, ఇంకా రాయండి.
Sorry to copy and paste the line from your post. I really mean that your writing style is excellent.
You have started a discussion on one of the important issue that we have to resolve in India for the survival of the open pluralistic society for the years to come. I agree with your post on content and tone.
The Democracy and the freedoms that we are enjoying in the west were the gifts of 600 years of bloodshed (Renaissance, Reformation, and seperation of State and Church).
But the freedoms and liberties in India were in-built in our Indic Tradtions for ages.
Yes. There were issues related to exploitation of Dalits or out-Castes or lower castes. We have to resolve them on urget basis.
Indian constitution is one of the anti-Secular constitution in India. One can also rephrase it as "Indian Constitution is one of the un-eual document", it divides people on the basis of Religion, Caste, Class, Sex, Region more so the majority community.
If you ask me, it must go away. We need a rational Constitution that suites to our countries needs.
వళ్ళంతా చెవి చేసుకుని అలికిడికి ఔనని తల విసురుతుంది దీపశిఖ, అని ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొస్తున్నాయి...:)..
ReplyDeleteమీలాంటి పెద్దవాళ్ళకోసమే చూస్తున్నాం సార్..ఇక బ్లాగులకి తిరుగులేదు...
మీ "లోలకం" బ్లాగులో నే వేసిన కామెంటు కనపడలేదు గురూగారూ..అందుకే మళ్ళీ ఇక్కడ కూడా అవే మాటలు నొక్కి వక్కాణిస్తున్నాను...
ReplyDeleteచాపమీదెక్కి గోష్ఠి నడుపుతూ, చెరుకు గడల్ని రసహృదయుల మీదకి విసిరినట్టు ఉంది ..ఇక మేము ఎన్ని గడలు పట్టుకోగలమో చూడాలి... ఆ పట్టుకున్నవాటిని లెక్కెట్టుకునే కార్యక్రమానికి మేము సిద్ధమయిపోతున్నామహో....మీరు రాయి విసిరినా రాకెట్టు విసిరినా ఆనందమే గురూగారూ !
భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతికి వచ్చిన పీడల్లా దాన్ని బీజేపీ పార్టీ తీసుకొస్తాని చెప్పడం. అసలే ముస్లింల మీద విషంకక్కే ఈ రాజకీయపక్షం ఈ మాట అనేసరికీ, మిగతా పక్షాలు తమతమ రాజకీయాలు చెయ్యడం మొదలెడతాయి. వీటిల్లోపడి ఒక అంగీకారాత్మక నిర్ణయం ఇప్పట్లొ వచ్చే అవకాశం అస్సలు కనిపించడం లేదు.
ReplyDeleteభారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతికి వచ్చిన పీడల్లా దాన్ని Hindus మీద విషంకక్కే Congress రాజకీయపక్షం is blocking it in favor Muslims.
ReplyDeleteThose illegitimate children of Islam captured media and political power in India.