Sunday, September 12, 2010
ఏమి సమంజసం?
జూలై 2010 రచన మాసపత్రికలో శ్రీకాకుళం నుండి ఎన్. బి. ఆర్. కె. భాను అనే ఆసామీ రాసిన ఒక ఉత్తరానికి స్పందిస్తూ శాయి ఒక సంపాదకీయం రాసేరు. ఆ పాఠకుని ఉత్తరం, ఆ సంపాదకీయాల సారాంశం: దేశంలో ప్రతి సంస్థకీ, కట్టడానికీ, జిల్లాకి, ఒక రాజకీయనాయకుడి పేరు పెట్టెయ్యటం ఏమి సమంజసం? నిజమే! రంగారెడ్డి జిల్లా, రాజశేఖరరెడ్డి జిల్లా అనుకుంటూ పోతే కొన్నాళ్లకి జిల్లాలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఊళ్లమీద పడతారు కాబోలు. కాకినాడ పేరు పళ్లంరాజు, తుని పేరు బుల్లిబాబు అవుతాయి కాబోలు. హైదరాబాదు పేరు కె. సి. ఆర్ గా మార్చాలనే కోరికతోటే తెలంగాణా ఉద్యమం ఆయన ప్రారంభించేడేమో కనుక్కోవాలి. ఢిల్లీ పేరు సోనియా అని మార్చేసి ఇండియా పేరు గాంధీ అని పెట్టేస్తే ఈ గొడవ తీరిపోతుందేమో!
Subscribe to:
Post Comments (Atom)
దురద పుడితే గోక్కున్నట్టు...చచ్చిన వాడికి ఏదో ఒక మెహర్బానీ చేయాలన్న దురదకి ఇది result అన్న మాట...అంతే తప్ప పేర్లు పెట్టిన వాడికీ ఇంట్రెస్ట్ లేదూ..జనాలకీ దానిమీద ఇంట్రెస్ట్ లేదండీ...
ReplyDelete