Wednesday, April 8, 2009

మనం ఏమీ చెయ్యలేమా?

8 ఏప్రిల్ 2009

స్విట్జర్లండు బేంకులలోని రహశ్య ఖాతాలలో డెబ్భయ్ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయిట. ఎవ్వరో నాకు ఈ-మెయిల్ చెయ్యగా తెలిసింది!

అయ్యబాబోయ్ 70,00,000 కోట్ల రూపాయలు!!

ఈ ప్రపంచంలో 180 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలవారు అందరూ దొంగచాటుగా డబ్బులు పట్టుకొచ్చి స్విట్జర్లండులో దాచుకోవటంలో వార్తావిశేషం ఏదీ లేదు. కాని ఈ 180 దేశాలలోనూ మన భారతదేశానిదే అగ్రస్థానం ట - ఇలా దొంగచాటుగా డబ్బు దాచటంలో.

ఎవరబ్బా ఇలా దాస్తూన్నది? మన రాజకీయ నాయకులే లంచాలు తినేసి ఇలా ప్రజల సొమ్ముని ఒడికేస్తున్నారని కొందరి ఊహాగానం. అన్ని పార్టీల వారూను.

అక్కడ బేంకులో డబ్బు అలా మూలుగుతూ ఉండగా మన నాయకులు ఇక్కడ టపా కట్టెస్తే ఆ డబ్బు గోవిందా గోవింద. మనం తిన్నది కాదు, మరొకడికి పెట్టింది కాదు. కనీసం తిరపతి హుండీలో వేస్తే పుణ్యం, పురుషార్ధం.

అయ్యబాబోయ్ డెబ్బయ్ లక్షల కోట్ల రూపాయలే నా ఊహకి కూడ అందటం లేదు.

ఈ పరిస్థితికి తరుణోపాయం లేదా? లేకేమి? ఉంది. ఒకటి, ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రెండు, ప్రస్తుతం పదవిలో ఉన్న నాయకులని, గతంలో పదవి అలంకరించిన నాయకులని తప్పించి కొత్త వారిని ఎన్నుకుని చూడాలి. మూడొంతులు వాళ్ళూ తినెస్తారు. అప్పుడు మనం మన కర్మ అని ఉత్తరీయం నెత్తిమీద వేసుకుని భోరుమని ఏడవాలి.

2 comments:

  1. మన దేశానిది అగ్రస్థానం మాత్రమే కాదు, మిగతా అన్ని దేశాలోక ఎత్తైతే మన దేశం అంతకంటే పేద్ద ఎత్తు

    ReplyDelete
  2. మీరు కూడా ఇలా అంటే ఎలా? అందరూ ఇలా నిరాశగ,నిస్పృహతో నిండిపోతే రేపటి పరిస్థితి ఏవిటి?
    వారికి వెయ్యరాదు. సరే. మరి ఎవరికి వెయ్యాలో చెప్పండి. చదువుకున్న వారు. మీరు కూడా ఇలా అంటే ఎలా చెప్పండి!
    ఈ టపా చూడండి.
    ఇంకా చాల మంది రాసారు, రాస్తున్నారు ఓటు ఎవరికి ఎలాంటి వారికి వెయ్యాలో చెప్పండి పోని.

    ReplyDelete